- పలు విత్తన దుకాణాలలో తనిఖీలు చేపట్టిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు.
- నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.
ముద్ర,తుంగతుర్తి: విత్తనాలు ఎరువులు పురుగు మందులు నాణ్యమైనవి రైతులకు అందించాలని కల్తీ విత్తనాలు అమ్మకం చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు.తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు ఎరువులు పురుగు మందులు విత్తనాలు దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు జరిపారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్ లను ఎరువులు పురుగు మందులు విత్తనాల వివరాలను పరిశీలించినట్లు తెలిపారు.ప్రతివారం ప్రతి మండలంలో ఐదు దుకాణాలను తనిఖీ చేయాల్సి ఉందని అందులో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో నాలుగు దుకాణాలను తనిఖీ చేశామని ఐదవ దుకాణా యజమాని అందుబాటులో లేకపోవడంతో దుకాణ యజమానికి మెమో ఇవ్వనున్నామని ఇంచార్జ్ ఏడి బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా దుకాణాల్లో అన్ని సజావుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
