Take a fresh look at your lifestyle.

నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి

  • పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ.

గచ్చిబౌలి, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోన గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లలోని ఆయా కాలనీల్లో రూ.8.34 కోట్ల వ్యయంతో నిర్మించబోయే భూగర్భ ఢ్రైనీజీ పనులకు కార్పోరేటర్లు గంగాధర్, రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.టీఎన్జీవో కాలనీ మరియు నల్లగండ్ల హుడా కాలనీలలో రూ.6 కోట్ల 74 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు మరియు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప వ్యాలీ మరియు మాధవ హిల్స్ కాలనీలలో రూ. 1 కోటి 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ టీఎన్జీవో కాలనీ మరియు నల్లగండ్ల హుడా కాలనీలలో రూ. 6 కోట్ల 74 లక్షల రూపాయల అంచనావ్యయంతో యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు మరియు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో ఈ రోజు టీఎన్జీవో కాలనీ మరియు నల్లగండ్ల హుడా కాలనీలలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. టీఎన్జీవో కాలనీ మరియు నల్లగండ్ల హుడా కాలనీలలో గల ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, నిత్యం పొంగుతుండటం వలన కాలనీ వాసులు ,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు స్వచ్చమైన త్రాగు నీరు అందించడమే నా ధ్యేయం అని, కాలనీ వాసులకు స్వచ్చమైన మంచి నీటిని అందించడమే లక్ష్యం అని చైర్మన్ గాంధీ తెలియచేసారు. 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప వ్యాలీ మరియు మాధవ హిల్స్ కాలనీలలో రూ. 1 కోటి 60 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, గంగాధర్ రెడ్డి మరియు జలమండలి డీజీఎం నరేందర్ రెడ్డి, మేనేజర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.