ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పట్టణంలోని 22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కోరారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 22వ వార్డు పరిధిలో 300మీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, కొన్ని చోట్ల సిసి రోడ్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశామన్నారు.
ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు సిఫారసు చేసి, అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటూ సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.