- పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈరోజు భారతదేశ సమగ్రత కాపాడబడుతుందంటే ఆనాడు బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచ దేశాలు కీర్తింపబడే గొప్ప మేధావి,దేశ స్వాతంత్రం ఏర్పడిన తదుపరి భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశంగా ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షింపబడే విధంగా జాతి మత కుల వివక్ష అనేది లేకుండా అందరూ సమానం అని తెలియజెప్పే విధంగా భారత రాజ్యాంగం రచించిన మహాత్ముడు బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.మహాత్ముడు బిఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కొలవడం మన అందరి బాధ్యత మన కర్తవ్యం, ఎవరయిన దుర్మార్గులు ఆ మహాత్ముడిని అగౌరవ పరిచినట్టు అయితే ఆ అవమానం మహాత్మునికి కాదు ఈ సమాజాన్ని ఆ గౌరవ పరిచినట్టు భావించాలన్నారు.అలాంటి ద్రోహులు ఎవరు అయిన చట్టపరిదిలో శిక్షింప చేయవలసిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉన్నది,ఈ దురదృష్టకర సంఘటనపై బాద్యులకు తక్షణమే చర్యలు తీసుకునే విదంగా సంబంధిత పోలీస్ యంత్రాంగం స్పందించి నేరస్థుడు ఎంత తొందరగా చట్టానికి లోబడి చట్ట పరిధిలో శిక్షింపబడితే భవిష్యత్తులో ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడకుండా కట్టుదిట్టం అవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంచంద్ర రెడ్డి, కల్లపల్లి దుర్గయ్య, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, ధర్మపురి ఎఎంసి డైరెక్టర్ రవి, మాజీ సర్పంచ్ రాజయ్య, ప్రశాంత్, మాజీ ఎంపీటీసీ విమల సుధాకర్, మాజీ సర్పంచ్ జమున రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరీష్, జగిత్యాల రూరల్ మండల కాంగ్రెస్ అద్యక్షుడు మధు, అసాది రాజన్న, లవన్, తిరుపతి, అప్పల స్వామి, వాసం శ్రీనివాస్, గోపన్న, మహేష్ , మాజీ కౌన్సిలర్స్ నక్క జీవన్, మోగిలి సింగరావు, నక్క విజయ్, నక్క రమేష్, గంగారాం శేఖర్, చందు, శేఖర్, రాజశేఖర్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
