Take a fresh look at your lifestyle.

బిసి ఆర్డినేన్స్ కేవలం స్థానిక ఎన్నికల స్టెంట్ మాత్రమే

  • కులవృత్తులకీ ప్రోత్సాహం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.
  • అన్ని వర్గాలకు అండగా నిలిచింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే.
  • జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: 20 నెలల తర్వాత ఆర్డినేన్స్ తీసుకొచ్చి, బిసిలా కోసం గొప్పగా చేశామానడం సిగ్గుచేటని, బిసిలను మోసం చేసే కుట్ర ఈ ఆర్డినేన్స్ అని.. మోసానికి ఎన్ని పదాలు ఉంటే అన్ని రేవంత్ కు వర్తిస్తాయని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వసంత మాట్లాడుతూ బిసిలా పక్షాన నిలబడి, బిసిలకు న్యాయం చేసింది బిఅరెస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ అని, అసెంబ్లీ లో బిల్లు పెట్టక ఆర్డినేన్స్ తేవడం ఎందుకు? మొదట్లోనే ఆర్డినేన్స్ తెస్తే అయిపోయేది కాదా? పదేళ్ల పాలన బీఆర్ఎస్ పార్టీ బీసీల పాలన – ప్రభుత్వం.. ఎం బిసిలకు కేసిఆర్ రూ 1000 కోట్ల నిధులు కేటాయించారు, బిసిలలో ఉన్న అనేక కులాల కుల వృత్తులకు మనుగడ, ఊతం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, స్ట్రీట్ వేండర్ లను సైతం ఆదుకున్న ఘనత కేసీఆర్, బీ అరెస్ ప్రభుత్వముదే. 20 నెలల కాంగ్రెస్ పాలనలో బిసి సామజిక వర్గాలకు చేసిన లబ్ది ఏంటో బిసి సమాజం కు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పై ఉందన్నారు. మత్స్యకారులకు ఉచిత చేపలు, చెరువుల్లో పూడిక తీత పనులతో పాటు చేపల మార్కెటింగ్, వాహనాలు ఇతర సౌకర్యాలు ప్రభుత్వం తరుపున అందించడం జరిగింది. గంగపుత్రులు, ముదిరాజ్ ల పక్షాన రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామని, రజక, నాయిబ్రాహ్మణ సోదరులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా, దోబి ఘాట్ ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. చేనేత కళ లకీ ప్రోత్సాహం అందించడంతో పాటు ఊరిసిల్ల గా పేరున్న సిరిసిల్ల ను సిరుల ఖిల్లగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ సర్కార్ దే. చేనేత వస్త్రాలపై కేంద్రం 5% జీఎస్టీ విధించింది. గొల్ల కురమలకు గొర్రెల పంపిణి అందించిన ఔనత్యం కేసీఆర్ కే దక్కుతుందని, కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్లకు చేయూత అందించిన ప్రభుత్వం బీ ఆర్ ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. రుణమాఫీ కాలేదు, భరోసా విడుదల కాలేదు. నిరుపేద పిల్లల కోసం జగిత్యాల లో 4 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఘనత కవితక్క, కేసీఆర్ దే అని పేర్కొన్నారు. బిసి ళ కోసం మీరేం చేశారు? కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది? బీసీ ల కోసం కవితక్క అన్ని కుల సంఘాల తో కలిసి అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీ ల కోసం పోరాటం చేసారు అని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఇష్టరీతిన హామీలు ఇచ్చారు. ఆర్డినేన్స్ లు న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. జయలలిత హయాంలో తెచ్చిన ఆర్డీ నేన్స్ కూడా కోర్టులలో నిలవలేదనే విషయం గమనించాలన్నారు. బిసి విద్యార్థుల చదువుకోసం కార్పొరేట్ తరహాలో గురుకులాలు ప్రారంభించ్చింది గత ప్రభుత్వమే. కులవృత్తులకీ ప్రోత్సాహం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. తల్లితండ్రుల కల కాసారం చేసేందుకు గత ప్రభుత్వం కృషి చేస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లితండ్రుల కళ్ళల్లో కన్నీటి ని నింపుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం తో 75 మంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడం దురదృష్టం. రాజకీయంగా యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చిందని, దానికి ఉదాహరణ తన పొలిటికల్ కెరియర్ అని అన్నారు. నూకపల్లి లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం, ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్నమన్న నేతలు విఫలం అయ్యారు. ఉద్యోగాల్లో నోటిఫికేషన్ లు ఇచ్చి పరీక్ష పూర్తి చేస్తే కేవలం ఆపాయింట్ మెంట్ లెటర్ లు ఇచ్చి ఆ ఘనత తమ ఖాతాలో వేసుకోవడం విచారం అన్నారు. సామజికంగా, ఆర్థికంగా ఎదిగేలా గత ప్రభుత్వం కృషి చేస్తుంది. ఓట్ల కోసం సీట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. బిసి ఆర్డినేన్స్ కేవలం స్థానిక సంస్థల స్టెంట్ మాత్రమే. రేవంత్ రెడ్డి మాట ఎట్లాయితే ప్రజల్లో చెల్లుబాటు కాకుండా పోయిందో, అయన తెచ్చిన ఆర్డినేన్స్ సైతం కోర్టుల్లో చెల్లుబాటు కాదని ఏద్దేవా చేశారు. అన్ని కులాలకు ప్రకటించిన కార్పొరేషన్ లు సంబరాలుకే పరిమితం అయ్యాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్రంపై ఒత్తిడి పెంచి 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్ లు చేర్చాలి. లేదా అఖిల పక్షం తో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి కేంద్రం పై ఒత్తిడి తేవాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం కు ప్రజా క్షేత్రం లో గుణపాఠం తప్పదన్నారు. ఈ సమావేశం లో అర్బన్ మండల అధ్యక్షులు తుమ్మ గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు వొళ్ళం మల్లేశం, మాజీ ప్రజాప్రతినిధులు బుర్ర ప్రవీణ్ గౌడ్, నాడెపు శంకర్, ఎల్ల రాజన్న, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దయాల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు చింతల గంగాధర్, పట్నం అనురాధ, గంగిపెల్లి వేణు, నీలి ప్రతాప్, హరీష్, పెండెం గంగాధర్, భూమేష్, బిసి ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.