ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ఈ రోజు, తేది: 30-03-2026 (సోమవారం) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మొత్తం 7 మంది ఫిర్యాదు దారులు హాజరయ్యారు.
ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదుల్లో భూమికి సంబంధించిన పంచాయతీలు 2 కాగా, తగు న్యాయం కోరుతూ 5 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై ఆలస్యం లేకుండా స్పందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.