Take a fresh look at your lifestyle.

వరిగుంతంలో పురాతన శాసనం గుర్తింపు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని బుర్ర సంతోష్ గుర్తించారు. దాని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం అని ఎఱయప్రోలు పేరు మీద వేసిన దానం గురించి తెలుపుతుందని తెలిపారు. గ్రామ పురాతన చరిత్రను తెలిపే ఇలాంటి శాసనాలు విగ్రహాలను కాపాడుకోవాలని తర్వాతి తరాలకు మన చరిత్ర గొప్పతనం తెలిపేలా మరుగునపడిన శిల్పాలను ఏదైనా గుడిలో లేదంటే గ్రామ పంచాయితీలో ఉంచి కాపాడుకోవాలని బుర్ర సంతోష్ పిలుపునిచ్చారు. 1782 మే 18 రోజున అప్పటి హైదరాబాద్ సంస్థానం లేదా దక్కన్ సుబా పరిపాలకుడు నిజాం అసఫ్ జా మీర్ నిజాం అలీ ఖాన్ కాలంలో వేయబడిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.