కోరుట్ల, ముద్ర:- రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలపాలైన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకొంది. స్థానికుల సమాచారం మేరకు కోరుట్ల మండల నాగులపేట గ్రామానికి చెందిన బైరి భరత్ 45 అనే వ్యక్తి తన కారును అతి జాగ్రత్తగా, వేగంగా నడుపుతూ కోరుట్లకు వస్తున్న క్రమంలో గుమ్లాపూర్ గ్రామ పొలిమేరలో మేకల మందను ఢీకొట్టి, వెంకటాపూర్ మూల మలుపు వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న బొలెరో వాహనాన్ని అదే వేగంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైరి భరత్ కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు బందువులు తెలిపారు. ఘటన స్థలాన్ని పోలిసులు పరిశీలించారు.