Take a fresh look at your lifestyle.

యూనివర్సిటీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఆర్ నారాయణ మూర్తి

హనుమకొండ, ముద్ర ప్రతినిధి: స్నేహ చిత్ర పిక్చర్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ వాల్ పోస్టర్ ను సినిమా దర్శక నిర్మాత నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కాకతీయ యూనివర్సిటీ వామపక్ష విద్యార్థి సంఘాల విద్యార్థులతో కలిసి సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. చదువుకునే రోజుల నుండి చదువును కొనుక్కునే పరిస్థితులను వివరిస్తూ కార్పొరేట్ కబంధహస్తాలలో చిక్కుకున్న చదువుతో సినిమా మొదలు అవుతుందని తెలిపారు.ఈరోజు ఎక్కడ చూసిన పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణంగా మారిందని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల పేపర్ లీక్ అవ్వడం ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ విద్యార్థుల పరీక్ష పత్రాలు లీక్ అవ్వడం అంటే ఈ సమాజాన్ని నాశనం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపార రంగంగా మార్చారని మండిపడ్డాడు.వర్సిటీ పేపర్ లీకేజ్ ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 22 విడుదల సినిమా విడుదల అవుతుందని తన సినిమాని ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు, నిరుద్యోగులు విద్యార్థులు అధిక సంఖ్యలో చూసి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాషబోయిన సంతోష్, రంజిత్ కుమార్, సాయి,వేల్పుల చరణ్,రవితేజ, వంశీకృష్ణ, కళ్యాణ్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.