మంథని, ముద్ర; దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని మంథనికి అర్దరాత్రి చేరుకున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. గురువారం హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్ చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి మంథనికి చేరుకున్నారు. మంథని నియోజకవర్గంలో అడుగడుగున నాయకులు, వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు మంత్రికి శుభాకాంక్ఠలు తెలిపి పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు.