Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో 26న మెగా హెల్త్ క్యాంప్

  • ఉచిత హెల్త్ క్యాంప్ ను మిరుదొడ్డి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

ముద్ర. మిరుదొడ్డి: మండల కేంద్రంలోని మెగా హెల్త్ క్యాంప్ పోస్టర్లను ఆవిష్కరించారు. అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈనెల 26 శనివారం రోజున ఆర్యవైశ్య భవన్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సభ్యులు అస్క స్వామి మాట్లాడుతూ ఉచిత మెగా హెల్త్ క్యాంపులో లో భాగంగా గుండె శాస్త్రం, ఎముకల విభాగం, నేత్ర వైద్యం, గైనకాలజీ, దంత వైద్యం, మెదడు నరాల శాస్త్రం, శిశు వైద్యం, మొదలైన క్యాంపులు కిమ్స్, లిటిల్ వన్, మొదలగు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనికిగాను మిరుదొడ్డి మండల చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ యొక్క హెల్త్ క్యాంప్ లో దాదాపు పది రకాలైన వ్యాధులకు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గొట్టం బైరయ్య, పొడేటి మహేందర్, నక్క స్వామి, రంగనమైన మల్లేశం, ఉస్కె కనకయ్య, బెండం శ్రీకాంత్, ర్యాకం బాలమల్లు, ర్యాకం మల్లయ్య, పోడేటి రాజు, స్వామి,వెంకట్, అనిల్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.