Take a fresh look at your lifestyle.

ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి . సత్య ప్రసాద్ తనిఖీ చేశారు. ఈ వి ఎం భద్రతకు సంబంధించి ప్రతి నెలలో తనిఖీ చేయడంలో భాగంగా ఈవీఎం గోడౌన్ కేంద్రంను సందర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, ఎలక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ తహసిల్దార్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.