కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల అతి పురాతనమైన శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని గరుడసేవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. స్వామివారు భక్తులకు గరుడ సేవపై దర్శనం ఇవ్వగా మహిళలు మంగళ హారతులతో, భక్తిశ్రద్ధలతో స్వామి నామస్మరణ చేస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కైంకర్యదాతలుగా కటుకం రంజిత్ సునీత దంపతులు వ్యవహరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యతిరాజం నరసయ్య, ధర్మకర్తలు నేతి శ్రీనివాస్, కటుకం దివాకర్, కోట గంగాధర్, గోడికే రాములు, చిలువేరి విజయ, పద్మ, పిఎసిఎస్ చైర్మన్ ఎలిశెట్టి భూమారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ పుప్పాల ప్రభాకర్, ఈవో విక్రమ్, ఎలిశెట్టి భూమారెడ్డి, పుప్పాల ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ పెడివెల్లి నరసయ్య పాల్గొన్నారు.