Take a fresh look at your lifestyle.

క్రికెట్​జట్టుకు హైదరాబాద్​ కుర్రాడు సాయి సంతోష్

ముద్ర, హైదరాబాద్​: హైదరాబాద్​కు చెందిన మరో క్రికెటర్​ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్​ వాసి రాపోల్​ సాయి సంతోష్​ దేశవాళీ 2024‌‌ .. 25 సీజన్​లో అరుణాచల్​ ప్రదేశ్​ అండర్​‌‌–‌23 క్రికెట్​ టీమ్​కు ఎంపికయ్యాడు.

బీసీసీఐ మెన్స్​ అండర్​–23 స్టేట్​–ఏ ట్రోఫీ కోసం జరగనున్న పోటీలకు అరుణాచల్​ ప్రదేశ్​ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏళ్ల సంతోష్​ జట్టులో ఆల్​ రౌండర్​గా రాణిస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయి అండర్​–16, 17 గేమ్స్​లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

Leave A Reply

Your email address will not be published.