Take a fresh look at your lifestyle.

మల్కాజిగిరిలో ప్రజా సమస్యల పరిష్కరించండి – మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్

 

మల్కాజిగిరి పరిధిలోని ప్రజా సమస్యల వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజిగిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా కు విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసి మల్కాజిగిరి కార్యాలయములో శుక్రవారం డిసి తో స్థానిక నాయకులతో కలిసి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ సర్కిల్ ల పునర్విభీకరణ తర్వాత శానిటైజేషన్ పనితీరు పూర్తిగా దెబ్బతిందని అన్నారు, శానిటైజేషన్ పైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిప్యూటీ కమిసినర్ ని కోరారు. అదేవిధంగా వీధి దీపాలకు సంబంధించి పాత అధికారి ట్రాన్స్ఫర్ కావడంతో నూతన ఏ. ఈ కవిత తో మాట్లాడి కరెంటు డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకోవాల్సినటువంటి విద్యుత్ స్తంభాల తరలిం,పు నూతన లైట్ల పనితీరుపై దృష్టి పెట్టాలని కోరారు. సర్కిల్ పరిధిలో దోమల బెడదకు సంబంధించి ఫాగింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో లక్ష్మణ్, జైకృష్ణ, నందు, మురళి, సంతోష్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.