ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ తూడుకుర్తి గ్రామం నందు సద్గురు పరబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ పల్లంకొండ మల్లయ్య గురుస్వాముల వారి 49వ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, పరమానందం కలగాలని ఆశిస్తూ ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మార్చి 21వ తేదీ శనివారం సాయంత్రం 5.00 గంటలకు గంధోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.
మార్చి 22వ తేదీ ఆదివారం ప్రధానోత్సవం సందర్భంగా ఉదయం 9.00 గంటలకు లక్షపుష్పార్చన, ఉదయం 11.00 గంటలకు ప్రదక్షిణలు, రాత్రి 7.00 గంటలకు లక్షదీపోత్సవం నిర్వహించనున్నారు.
మార్చి 23వ తేదీ సోమవారం ఉదయం 9.00 గంటలకు ప్రత్యేక పూజలు, సమాప్తి కార్యక్రమాలు నిర్వహించి మహోత్సవాలను ముగించనున్నారు.
ఈ మూడు రోజుల పాటు భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.