వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎం ఆర్ పి ఎస్ యాదాద్రి జిల్లా నాయకులు కాకునూరి మహేందర్
- వర్గీకరణ విషయంలో వెనక్కు తగ్గేదెలేదన్న మంత్రి దామోదర రాజ నర్సింహ
ముద్ర ప్రతినిధి, భువనగిరి : సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎస్సీ వర్గీకరణ,విషయంలో ముందుకు వెళ్లేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టీస్,శమీమ్ అక్తర్ ఏక సభ్య కమీషన్,నివేదికను రాష్ట్ర మంత్రివర్గం,శాసనసభ ఆమోదంకు కృషిచేసిన రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆర్ పి ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు కాకునూరి మహేందర్ శుక్రవారం హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై తదుపరి కార్యకాచరణ కోసం ప్రభుత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్ అమలు పరచడం లో వెనక్కి తగ్గేది లేదని సూచించారు.