Take a fresh look at your lifestyle.

రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలి సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

 

చిలుకూరు, ముద్ర: రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చాలని చిలుకూరు మండల కేంద్రంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ సభ్యులు కస్తూరి సైదులు మాట్లాడుతూ, రైతులకు యూరియాను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఘోరంగా విఫలమయ్యాయని రైతులు యూరియాని తీసుకోవడం కోసం ప్రభుత్వాలు ఒక కొత్తగా యాప్ ని తీసుకువచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని,ఈ యాప్ ద్వారా ఆన్లైన్లో యూరియాను రైతులు బుక్ చేసుకోవడం చాలా సమస్యగా మారిందని ప్రతి రైతుకి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటేనే ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవడం సాధ్యం అవుతుందని ఆండ్రాయిడ్ మొబైల్ గురించి అవగాహన లేనటువంటి రైతులు మరియు ఆర్థికంగా ఖరీదైనటువంటి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయలేనటువంటి రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు యూరియా పంపిణీలో ప్రస్తుత విధానాన్ని మార్చి జిల్లా వ్యాప్తంగా కాకుండా క్లస్టర్ల వారీగా పరిగణంలోకి తీసుకొని సరఫరా చేయాలని దీనివల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందుతాయని అన్నారు. అనంతరం చిలుకూరు మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి సిపిఐ నాయకులతో మాట్లాడి రైతులకు సంబంధించిన యూరియా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎస్.కె సాహెబల్లి, పిల్లుట్ల కనకయ్య, చిలువేరు ఆంజనేయులు, మండవ అచ్చయ్య, దొంతగాని వీరస్వామి, మాధవరపు వెంకటేశ్వర్లు, దొడ్డ నాగేశ్వరరావు, ఇల్లుట్ల కృష్ణయ్య, మాదాసు చిన్న ముత్యాలు, కందుకూరి సైదులు, బాలే బోయిన రవి, సిద్దెల రాములు, కొండా శేషయ్య, కందుకూరి పెద్ద వెంకటేశ్వర్లు, బొడ్డు కాశయ్య, కాసాని అంజయ్య, ఎస్కే జానీ, ప్రశాంతు,శంబయ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.