ముద్ర, శేరిలింగంపల్లి :
“అహింస బలహీనత కాదు,అది అత్యున్నతమైన శక్తి-ఈ మహత్తర విలువను జైన సమాజం అద్భుతంగా ఆచరిస్తోంది” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల డివిజన్‌లో నల్లగండ్ల హుడా ప్రాంతంలో నిర్మించిన శ్రీ దిగంబర్ జైన్ జినాలయ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జైన సమాజ సభ్యులు మరియు స్థానిక కాలనీ ప్రజలతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వి. జగదీశ్వర్ గౌడ్. శాంతి మార్గమే మన లక్ష్యమని, అహింసను ప్రోత్సహించవద్దని గుర్తు చేశారు. జైన దేవాలయాలు శాంతికి నిలయాలని కొనియాడారు.