నాగర్ కర్నూల్ – ముద్ర ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధిగా కృష్ణారెడ్డిని నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయనను అధికారికంగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డీసీసీ కమిటీలో తనకు స్థానం కల్పించినందుకు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు డా. చిక్కుడు వంశీ కృష్ణ, ఎంపీ మల్లురవి ఆశీర్వాదంతో ఈ అవకాశం దక్కిందని కృష్ణారెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.