Take a fresh look at your lifestyle.

​తెలంగాణలో జనసేనను బలోపేతం చేద్దాం: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పిలుపు

ముద్ర కూకట్‌పల్లి :
తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ మరియు సైబరాబాద్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పిలుపునిచ్చారు. కె.పి.హెచ్.బి ఫేస్-5 లోని తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సైబరాబాద్ కార్పొరేషన్ అడక్ కమిటీ మరియు సాదక్ ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను గడపగడపకూ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా క్రియాశీలక ఉద్యమి సభ్యత్వాల ద్వారా ప్రజలను పార్టీలోకి ఆహ్వానించాలి.
​ప్రతి పేద కుటుంబానికి సభ్యత్వం అందేలా చూడాలి. పార్టీ అందించే భీమా పథకం ఆపద సమయంలో కుటుంబాలకు ఏ విధంగా అండగా ఉంటుందో వివరించి వారికి అవగాహన కల్పించాలి.
​రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన జెండాను రెపరెపలాడించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ నియోజకవర్గ నాయకులు, జనసేన సాదక్ లు, జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.