Take a fresh look at your lifestyle.

​ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

 

​కేపీహెచ్‌బీ బతుకమ్మ కుంట వద్ద పార్కింగ్, టాయిలెట్ సమస్యల పరిష్కారానికి హామీ

ముద్ర ​కూకట్‌పల్లి: ప్రజా సమస్యల పరిష్కారంలో మన ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక పార్టీ నాయకులతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లోని బతుకమ్మ కుంటను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బతుకమ్మ కుంట వద్ద వాకింగ్, స్కేటింగ్ మరియు ఓపెన్ జిమ్ కోసం ప్రతిరోజూ వందలాది మంది వస్తుంటారు. అయితే, ఇక్కడ సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో సందర్శకులు తమ వాహనాలను రహదారులపైనే నిలుపుతున్నారు. దీనివల్ల స్థానికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా, పార్కు ఆవరణలో టాయిలెట్ సౌకర్యం లేకపోవడంతో మహిళలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను రమేష్ దృష్టికి తీసుకెళ్లారు.సమస్యల తీవ్రతను గమనించిన బండి రమేష్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సందర్శకుల కోసం తక్షణమే వాహనాల పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని మరియు ఆధునిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఫణీంద్ర, రంగమోహన్, పిడికిటి గోపాల్ చౌదరి, అరవింద్ రెడ్డి, వినోద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.