రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ముందున్నారు. మొత్తం పోలింగ్ 73.01 శాతంగా నమోదైంది. ఇందులో మహిళలు 73.39%, పురుషుల ఓటింగ్ 72.63% జరిగింది. ఏడు కార్పొరేషన్ లలో పోలింగ్ 66.05 %, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ 75.88 % పోలింగ్ అయ్యింది. అత్యధికంగా చౌటుప్పల్ లో 91.91, నందికొండ : 56.68%, కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండ : 77.36, అతి తక్కువ నిజామాబాద్ : 59.12% నమోదైంది.