Take a fresh look at your lifestyle.

కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతి కి సన్మానం.

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
భువనగిరి మున్సిపల్ కి నూతనంగా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతిని శ్రీ పెద్దమ్మ తల్లి పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా భువనగిరి పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీ శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయంలోశాలువ పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ముందుగా ఆమె అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరపతి సంఘం సభ్యులు ఈర్ల వెంకటేష్, లింగాల బిక్షపతి, కుక్కదుగ సోమయ్య, తుపాకుల శ్రీనివాస్ కొలుపుల వివేకనంద, కుక్కదూగ కృష్ణ, తుపాకుల సురేష్, మేడబోయిన కృష్ణంరాజు, జంగిటి రవీందర్, కుశంగల నరసింహ, మేడబోయిన కుమార్, సొప్పరి రవి, జంగయ్య, మేడబోయిన గిరి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.