Take a fresh look at your lifestyle.

సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత” కార్యక్రమంలో భాగంగా భువనగిరి ఖిల్లా, యాదగిరిగుట్టలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అభినవ్, వినోద్, హెరిటేజ్ మెంబర్ అంజయ్య, టూరిజం పోలస్ సంతోష్, మమత, దుర్గ, నవభారత్ యువజన సంఘం నాయకుడు సరగడ కరుణ్, మెరుగు మధు, సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మెరుగు మధు యువకులు పాల్గొన్నారు.
ధనంజనేయులు మాట్లాడుతూ “స్వచ్ఛ తెలంగాణ” అంటే కేవలం రోడ్లు శుభ్రంగా ఉండటం మాత్రమే కాదని మన పరిసరాలను, పాఠశాలలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం, యువత ముందుకు వస్తే ఏ మార్పైనా సాధ్యమే అన్నారు.
“మన తెలంగాణ – మన బాధ్యత” అనే భావనతో ముందుకు సాగుదామన్నారు.

Leave A Reply

Your email address will not be published.