Take a fresh look at your lifestyle.

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా ముగిసిన సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ :
సుందరకాండ ఒక గొప్ప రచన అని దీనిని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో, శ్రద్ధతో పఠించాలని, శ్రీరాముని గుణాలను అలవర్చుకోవాలని మరియు విజయం వైపు పయనించాలని, ఆంజనేయులు వలె ధైర్యాన్ని, సాహసాన్ని, బలాన్ని పెంపొందించుకోవాలని మరియు ఆటంకాలను అధిగమించాలని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు వారి పరివారంతో, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎల్.రాజ భాస్కర్ రెడ్డి గారితో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో గత ఐదు రోజులుగా వేడుకగా నిర్వహిస్తున్నటువంటి సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ముగింపు సందర్భంగా వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో శ్రీరామచంద్ర స్వామి చిత్రపటానికి పూలమాల వేసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణం మహా అద్భుతమైన కావ్యమని మరియు రామాయణంలోని విషయాలను సమాజంలో అమలుపరచినట్లయితే ప్రతి రంగంలోనూ విజయాలను నమోదు చేయగలుగుతామని తద్వారా ఉత్తమమైన స్థానాన్ని సైతం కైవసం చేసుకోగలుగుతామని వారు చెప్పారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారదుడు వాల్మీకి మహర్షిని ప్రపంచంలో అద్భుతమైన కావ్యం. నారద మహర్షి వాల్మీకి మహర్షిని ఏ కావ్యం చాలా విశిష్టమైనది అని అడిగితే సుందరకాండ అని బదులు బదులిచ్చారని వారు చెప్పారు.
ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలిగేలా రచించినటువంటి సుందరకాండ కావ్యాన్ని ప్రతి ఒక్కరూ అందులోని విషయాలను సంక్షిప్తంగా తెలుసుకోవడమే కాకుండా నిజ జీవితంలో సైతం వాటిని అమలుపరచాలని సూచించారు. శ్రీరాముడు అనుసరించిన విధానాలు చాలా మార్గదర్శకమే కాకుండా స్ఫూర్తి నింపుతాయని వారు చెప్పారు.
ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ గారు మాట్లాడుతూ శ్రీ రాముని వారి ప్రతి ఒక్కరు ధైర్యవంతునిగా, గుణవంతునిగా, వీర్యవంతునిగా, సౌందర్య సౌందర్యవంతునిగా, బదిలీ సమాజంలో ఉత్తమమైన స్థానానికి ప్రవేశం చేసుకొని భగవంతునితో అనుసంధానామి అనుసంధానమై సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలని వారు చెప్పారు.
గ్రంథాలను ఇతిహాసాలను పఠించిన వారికి చాలా చక్కటి శుభఫలాలు కలుగుతాయని అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వారు అభిప్రాయపడ్డారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు గొప్ప నిర్ణయం అని ప్రత్యేకంగా చరిత్రకు మారుపేరు భారతదేశము అని గుర్తు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని రెట్టింపు చేయడానికి మరియు ఇతరులలో భక్తి భావాన్ని పెంపొందించుటకై ప్రతి ఒక్కరూ గ్రంథాలను పట్టించాలని సూచించారు.
ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో నరేందర్ రెడ్డి గారి సారాధ్యంలో విద్యార్థులకు చక్కటి విద్యతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించడం జరుగుతుందని వారు చెప్పారు. డా.ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టి భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు సంధి తిరుపతి రెడ్డి గారు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆలయాల కమిటీ సభ్యులుగా పాల్గొని శ్రీరాముని విశిష్టతను తెలుసుకున్నారు మరియు సుందరకాండ ప్రవచన అద్భుతాన్ని ఇతరులకు తెలియపరస్తామని మరియు అమలుపరిచే విధంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు
ముగింపు కార్యక్రమం సందర్భంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అదే విధంగా కార్యక్రమం అనంతరం విచ్చేసిన అందరికీ అల్పను కల్పించారు

Leave A Reply

Your email address will not be published.