ముద్ర, ఫిబ్రవరి 23:
ఆంధోల్ నియోజకవర్గ పరిధిలోని భర్దిపూర్ ప్రాథమిక పాఠశాల ప్రహరీకి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్ సైన్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు బర్దిపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టేక్మాల్ మండల మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి,బర్దిపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.సంగమేశ్వర్ ఆధ్వర్యంలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామసర్పంచ్ సాయిబాబా,ఉపసర్పంచ్ శంకరయ్య,వార్డు మెంబర్స్ అంజయ్య,రాధా,రవి,గోపాల్ బాబు,పాఠశాల హెచ్ఎం మంజుల,పాఠశాల కమిటీ చైర్మన్ స్వప్న,పంచాయతీ కార్యదర్శి గోపి, ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కిష్టయ్య శ్రీనివాస్ మరియు వాటర్ షెడ్ కమిటీ మెంబర్ రవికుమార్ గ్రామ కాంగ్రెస్ నాయకులు బంటు రాములు పి.నర్సింలు, బీరప్ప, ఎం.నర్సింలు, పాపయ్య,మహేందర్ రెడ్డి, యాదగిరి,యూత్ కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.