ఇంటి మంజూరి ఉత్తర్వులను మృతుని తల్లికి అందించిన జిల్లా కలెక్టర్
ముద్ర ప్రతినిధి , కోదాడ ….. ఇటీవల మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని జిల్లా కలెక్టర్ కోదాడ లోని రాజేష్ తల్లి కర్ల లలితకు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని రెండు, మూడు నెలల్లో పూర్తి చేసి అందించాలని సంబంధిత హౌసింగ్ ఏఇని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేయొద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ, హౌసింగ్ ఏఈ జెఎస్ఎన్ మూర్తి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు