Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ సన్నాహ సమావేశం

  • సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

మల్యాల, ముద్ర విలేకరి: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని సీనియర్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మద్దుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి పార్టీ జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శనిగరపు తిరుపతి, పోతాని రవి, నులుగొండ సురేష్, చిట్యం భూమన్న, పొనగంటి శ్యాంసుందర్, బండి రవిగౌడ్, కొట్టేపల్లి బాబు, ఎండి ఇమామ్, నల్ల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.