Take a fresh look at your lifestyle.

ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం

 

కోరుట్ల, ముద్ర;
భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పిలుపు మేరకు కథలాపూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ లో మహిళా బిల్లును ఇండియా కూటమి నాయకులు వ్యతిరేకించడం దారుణమన్నారు. ఇండియా కూటమి నాయకులు మహిళల పట్ల వివక్ష చూపే విదంగా వ్యవహారించడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. మహిళా సాధికారతకు చీకటి రోజు అని నాయకులు అన్నారు. ఇండియా కూటమి డౌన్ డౌన్ మహిళా బిల్లును అడ్డుకున్న ముర్కుల్లారా ఖబర్దార్, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, మండల ప్రధాన కార్యదర్శి నరెడ్ల రవి, సీనియర్ నాయకులు బద్రి సత్యం, కాసోజీ ప్రతాప్, వొడ్డాటి సునీల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.