ముద్ర, మోత్కూర్:
ఇటీవల అకాల మృతి చెందిన కాశమేని చంద్రయ్య ముదిరాజ్ మృతి ముదిరాజు లోకానికి తీరని లోటని ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కోమటి మత్స్యగిరి అన్నారు. శనివారం సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చంద్రయ్య దశ దినకర్మలో పాల్గొని చంద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మోత్కూర్ లో పెద్దమ్మ గుడి నిర్మాణంలో,మొదటి సారిగా భవానీ మాల ధారణలో, ముదిరాజ్ సంఘం సమస్యల పరిష్కారంలో చంద్రయ్య పోషించిన పాత్ర వెలకట్టలేనిదని ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు చంద్రయ్యకు జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం సోమ నర్సయ్య, పన్నాల శ్రీనివాస్ రెడ్డి,కోమటి జనార్ధన్, దొంతరబోయిన వెంకటేశం,మన్నే మల్లయ్య, గుండు నర్సయ్య, గనగాని అనిల్,నిమ్మల బిక్షపతి, బందేల రవి,శ్రీను, శ్రీహరి, భీమయ్య, చిరంజీవి నాగయ్య, రాజు,వీరేశం, అవిలయ్య, బిక్షపతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు