Take a fresh look at your lifestyle.

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిర ఆదాయం

  • నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: రైతులకు స్థిర ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని నాగర్ కర్నూల్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊర్కోండ మండలం మాదారం గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతు శ్రీకాంత్ కు చెందిన 10 ఎకరాలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ , మరో రైతు కృష్ణారెడ్డి ఆయిల్ ఫామ్ మొదటి క్రాప్ కట్టింగ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.నాగర్ కర్నూల్ జిల్లా ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు కూడా దిగుబడి బాగుంటుందని, గతంలోనే జిల్లాను సందర్శించి ధ్రువీకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ప్రోత్సాహం ఇస్తూ, ఆయిల్ పామ్ పంటను పెంచే దిశగా రైతులకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతు పొలంలో నాటిన ఆయిల్‌ పామ్‌ గెలలు, రానున్న నాల్గవ సంవత్సరం నుంచి 30సంవత్సరాలవరకు దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలనుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నామని, తోటలు అధికంగా సాగు చేయడం వలన మనమే ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. దీని వల్ల రైతులకు దీర్ఘకాలికంగా స్థిర ఆదాయం లభించే అవకాశం ఉంది. రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, జిల్లాలో మరింత దిగుబడిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటికే 7 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు జరిగిందని, జిల్లాలో 60 వేల మంది రైతులు 10 ఎకరాల పొలం కలిగిన ఉన్నారని వారందరూ ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి సారించాలని, రైతు పంటల మార్పిడి పద్ధతిలో ఆయిల్ పామ్ ను చేర్చడం వల్ల వారికీ స్థిరమైన ఆదాయం లభించవచ్చు అని సూచించారు. రైతు పొలం వద్దకు అధికారులతో కలిసి ట్రాక్టర్లు ప్రయాణం చేసి రైతులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, తాహసిల్దార్ యూసఫ్ అలీ, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.