అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్నేవారిపల్లి గ్రామం ఎస్ఎల్బీసీ పాయింట్ గుండం దగ్గర అకాల వర్షానికి పిడుగుపాటుకు జక్కుల సాయిలు కు సంబంధించిన 25 మేకలు చనిపోయాయి. సాయిలు కుటుంబానికి ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించాలని సుమారు వీటి విలువ సుమారుగా మూడు లక్షల రూపాయలు ఉంటుందని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు.జీవనాధారం కోల్పోయిన బాధితులు తమ కళ్ళముందే పిడుగుపాటుకు మూగజీవాలు చనిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు.