ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో కల్వకుర్తి మండలం లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మార్చాలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నత ప్రతి పని కనబరిచి అందరి మన్ననలు పొందుతున్నారు. పరీక్షకు మొత్తం 74 మంది విద్యార్థులు హాజరు కాగా అందులో 73 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో కే. శిరీష 546 స్కూల్ సెకండ్ పి. వర్షిత-542,కే .కీర్తన-542 ఎం .అఖిల-541, ఏ. ఐశ్వర్య-533 ,డి సింధుజ-532, ఎం పల్లవి-532 మార్కులు సాధించగా 18 మందికి పైగా 500 మార్కులు వచ్చాయి.సత్ఫలితాలు సాధించడానికి ప్రధానోపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ ఉపాధ్యాయులతో సంప్రదింపులు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ విద్యార్థులకు అల్పాహారం ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగతమైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు అంటున్నారు.తల్లిదండ్రులతో సమావేశాలు ఫోన్ ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని అంచనా వేయడం వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వీక్లీ టెస్ట్ లు అసైన్మెంట్లు ఈ విధంగా నిరంతర కృషి ఫలితాలను ఇచ్చిందని ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ తెలిపారు స్కూల్ టాపర్స్ను మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు అభినందించారు.