ముద్ర, రాయికల్ విలేఖరి : రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ శ్రీరాముల నాగార్జునను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అందరికీ స్వీట్ల పంపిణీ చేసి, హర్షాతిరేకంగా వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ నాగార్జున మాట్లాడుతూ, సన్మానించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చందనగిరి రమేష్, ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి ఎదురుగట్ల రవీందర్, కార్యవర్గ సభ్యులు కొడిమ్యాల శంకరయ్య, మండలోజీ శ్రీనివాస్, కొమురవెల్లి రాజేందర్, శ్రీపాద లక్ష్మీనారాయణ, కడార్ల చంద్రశేఖర్, ఇనుగుర్తి రవీందర్, కొడిమ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.