ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం – ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమ విద్యార్థులు (RAWEP 2025 – 26) రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్బంగా కళాశాల అస్సోసియట్ డీన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ మాట్లాడుతూ ముందుగా తాజ్ పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమన్నారు. వ్యవసాయ విద్యలో భాగంగా విద్యార్థులకు 3 సంవత్సరాల చదువు తరువాత విద్యార్థులు అంత ఒక గ్రామాన్ని ఎన్నుకొని అక్కడ ఒక 6 నెలల పాటు రైతులతో ఉంటూ వారికి పంట పొలాల్లో టెక్నాలజీ పరంగా కానీ మరే ఇతర వ్యవసాయానికి సంబంధిన సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు ఉపయోగపడుతూ, విద్యార్థులకు తెలియని విషయాలు రైతుల దగ్గర నేర్చుకుని వారు చదువుకున్న చదువును రైతు సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారని తెలిపారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన రైతు సందర్శన చాల బాగుందని వారు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, డా. డి. శ్రీలత, శ్రీనివాస్, మండల రైతులు కంచి మల్లయ్య, ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కేహైమద్, రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.