Take a fresh look at your lifestyle.

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేర్ నర్సారెడ్డి

కోరుట్ల, ముద్ర విలేకరి: తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన న్యాయవాది శేర్ నర్సారెడ్డి ఎంపికయ్యారనీ, ఈ మేరకు నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.హైదరాబాద్ లో ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభ సమావేశాన్ని నిర్వహించామని అన్నారు.ఈమేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేర్ నర్సారెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య తెలిపారు.ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాదినేని రాజేందర్ ల ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.