Take a fresh look at your lifestyle.

దేవస్థానం కాంప్లెక్స్ లో షాపులు కేటాయించండి

  • ఎమ్మెల్యే తెల్లంకు కిరాయి దుకాణదారుల వినతి

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనుల్లో దుకాణాలు కోల్పోతున్న కిరాయిదారులు తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కోరారు. దేవాలయ అభివృద్ది పనుల్లో భాగంగా భూసేకరణకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 34 కోట్లు మంజూరు చేసింది.ఈ నేపధ్యంలో తెల్లం వెంకట్రావు శనివారం ఆలయ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా తెల్లంను కలసిన దుకాణాల కిరాయిదారులు, దుకాణాలు కోల్పోయిన యజమానులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుంది, కానీ, దుకాణాలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తమకు దేవాలయ అభివృద్దిలో భాగంగా కొత్తగా నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ లో షాపులు కేటాయించాలని కోరారు. స్పందించిన తెల్లం వెంకట్రావు, ప్రభుత్వంతో మాట్లాడి, ఇప్పుడున్న కిరాయిదారులకు షాపులు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.