Take a fresh look at your lifestyle.

ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలి

  • ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్.

కోరుట్ల, ముద్ర: కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అభివృద్ధి కమిటీతో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ శనివారం రోజు ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అసంపూర్తిగా, నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం పనులు త్వరగా పూర్తీ చేయాలని అసెంబ్లీలో చర్చించానని అన్నారు. అలాగే టీజీఐఐసీ అధికారులతో మాట్లాడి త్వరగా ఆక్సిజన్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్ కు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. త్వరలో ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి ఆసుపత్రికి అవసరమయ్యే శానిటేషన్ స్టాఫ్ ను నియమించేలా విన్నవిస్తామని అన్నారు. డయాలసిస్ పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూపర్డెంట్ తో మాట్లాడి బిడిఎస్ దంత వైద్యులు ఉన్నందున వారికి అవసరమయ్యే పరికరాలు అందించాలని కోరారు.ఆసుపత్రిలో వైద్యం బాగానే ఉందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రోగులతో, వారి బంధువులను అడిగారు.ఏమైనా సమస్యలుంటే దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో హాస్పటల్ సూపర్డెంట్ డాక్టర్ సునీత గారు, డాక్టర్ లక్ష్మీ , డాక్టర్ వినోద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.