Take a fresh look at your lifestyle.

విధానపరమైన లోపాలు ఉంటే ప్రతిపక్షం ఎత్తిచూపాలి

  • అధికారపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం
  • నాకు ఎలాంటి భేషజాలు లేవు
  • ఎవరి సలహాలైనా స్వీకరిస్తా
  • విద్యార్ధి రాజకీయాలను ప్రోత్సాహించాల్సిన అవసరముంది
  • దేశాభివృద్ధి కోసం ప్రధాని మోడీతో కలిసి పనిచేస్తాం
  • పెండిగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరాను
  • ఉనికి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

 

ముద్ర, తెలంగాణ బ్యూరో : పాలకపక్షంలో విధానపరమైన లోపాలు ఉంటే ఎత్తిచూపే హక్కు ప్రతిపక్షానికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వమని, తనకు ఎలాంటి భేషాజాలు లేవన్నారు. ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చట్ట సభల స్ఫూర్తిని కోల్పోతున్నామని, విభన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. విపక్షాల విమర్శలు చేయడానికి ,సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉండాలన్నారు.

ప్రభుత్వం ప్రతిపక్షానికి విలువ ఇస్తోందని, తమ ఏడాది పాలనలో అసెంబ్లీలో ఒక్క సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో ని ఓ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రచించిన ఆత్మకథ ” ఉనికి ” పుస్తకాన్ని గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ లక్ష్మణ్ లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం ఉన్న లేకపోయినా సరే అనేక మంది సిద్ధాంతం కోసం పనిచేశారని , అలాంటి రాజకీయాలు తెలంగాణలో మళ్ళీ రావాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో పనిచేస్తే సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారన్నారు. విద్యార్ధి రాజకీయాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ చెప్పారు.

ఆనాటి రోజుల్లో పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి నాటి విద్యాసాగర్ రావు లాంటి నేతలు కృషి చేశారని కొనియాడారు. గోదావరి జలాల వినియోగం కోసం విద్యాసాగర్ రావు శ్రమించినప్పటికీ ఆయన కల సంపూర్ణంగా పూర్తి కాలేదన్నారు. విద్యాసాగర్ రావు అనుభవం తెలంగాణకు ఎంతో అవసరమన్నారు. తుమ్మిడిహట్టి వద్ద భూసేకరణ కోసం ఎవరి వద్దకైనా వెళ్తానని, తనకు భేషయాలు లేవని సీఎం రేవంత్ చెప్పారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామని అన్నారు. దేశాభి వృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్తాన్నారు. పెండింగ్ జెక్టులకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరానని ఆయన చెప్పారు. కాజీపేట రైల్వే డివిజన్, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ విస్తరణకు కేంద్రమంత్రి బండి సంజయ్ కేంద్రంతో మట్లాడాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్కిల్ వర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో పతకం సాధించడానికి కృషి చేస్తున్నామని, త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.