ముద్ర, మంథని :
తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలు కాకతీయ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మంథని పట్టణంలోని కాకతీయ పాఠశాలలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ముందస్తుగా ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఉగాది పచ్చడి, భక్ష్యాలు అందరికీ పంపిణీ చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి రెడ్డి, పావని రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.