సేవ సంకల్పంతో వాస రాఘవేందర్ జన్మదినం సందర్భంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం – రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు నిధుల పంపిణీ
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్‌లో క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ వాస రాఘవేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు క్లాస్మేట్ క్లబ్ ప్రతినిధులకు మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

వారంవారీ కార్యక్రమాల నిర్వహణ కోసం వివిధ డివిజన్లకు నిధులు కేటాయించారు. ప్రతి సోమవారం కొల్లాపూర్ డివిజన్‌లో కార్యక్రమాల నిర్వహణకు ప్రతినిధి శ్రీదేవికి రూ.50 వేల రూపాయలు అందజేశారు. మంగళవారం అచ్చంపేట డివిజన్ కార్యక్రమాల కోసం బంధం పరమేశ్వర ప్రసాద్‌కు రూ.50 వేల రూపాయలు ఇచ్చారు.
బుధవారం కల్వకుర్తి డివిజన్‌లో కార్యక్రమాల నిర్వహణకు యాద శోభన్‌కు రూ.50 వేల రూపాయలు, గురువారం నాగర్ కర్నూల్ డివిజన్ కార్యక్రమాల కోసం ఎండి కాజాకు రూ.50 వేల రూపాయలు అందజేశారు.
శుక్రవారం వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు బి రాఘవేందర్‌కు రూ.60 వేల రూపాయలు, శనివారం గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కార్యక్రమాల కోసం కే చంద్రకులకు రూ.40 వేల రూపాయలు అందజేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శనివారం మరియు ఆదివారం కార్యక్రమాల నిర్వహణకు బాలకృష్ణ, రవీందర్ రెడ్డి లకు రూ.50 వేల రూపాయలు అందజేశారు. అలాగే ప్రభుత్వ సెలవు దినాల్లో కార్యక్రమాల నిర్వహణ కోసం బొప్పల్లి అల్లంపల్లి రమేష్‌కు రూ.50 వేల రూపాయలు అందజేశారు.
వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ప్రయాణ ఖర్చుల కోసం దర్శి రాజయ్యకు రూ.50 వేల రూపాయలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాస లక్ష్మీ రాఘవేందర్, రాష్ట్ర కార్యదర్శులు కెపి ప్రసాద్, కే లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి రమణ, ఉపాధ్యక్షులు సంబు శ్రీనివాసులు, నాగర్ కర్నూల్ డివిజన్ కోశాధికారి ఆర్ సురేందర్, శ్రీనాథ్, సుధాకర్, వెంకటస్వామి మరియు క్లాస్మేట్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.