Take a fresh look at your lifestyle.

యూనివర్సిటీ కబడ్డీ జట్టుకు జాగృతి కళాశాల విద్యార్థి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
స్థానిక జాగృతి డిగ్రీ కళాశాల బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ముత్తురాజు ప్రశాంత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ క్రీడలలో భాగంగా జాగృతి కళాశాల తరఫున పాల్గొని యూనివర్సిటీ కబడ్డి జట్టుకు ఎంపిక కావడం జరిగింది. ఈ కబడ్డీ జట్టు మరొక యూనివర్సిటీ తో కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొన బోతుంది. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి విద్యార్థి ని గోల్డ్ మెడల్ మరియు శాలువాతో సన్మానించి అభినందించారు. రాష్ట్రస్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏ.మణిపాల్ రెడ్డి, అడమిక్ కోఆర్డినేటర్ సి హెచ్. నవీన్, కెమిస్ట్రీ హెచ్ ఓడి ఎల్మా రెడ్డి, కామర్స్ హెచ్ ఓడి వెంకట్ రమణ, కళాశాల ఎన్ ఎస్ ఎస్, స్పోర్ట్స్ ఇంచార్జ్ పి.వెంకటేష్ అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.