- 4 తులాల బంగారం, 50 వేల నగదు చోరీ
కోరుట్ల, ముద్ర: కోరుట్లలోని కాముడు పెంట వద్ద గల మైలారపు అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి బీరువాలు పగలగొట్టి బంగారం,నగదునుమండలం దోచుకెళ్లారు. వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల పాతబజార్ లోని కాముడు పెంట వద్ద గల మైలారపు అంజయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైదారాబాద్ లో ఉన్న కొడుకు వద్దకు వెళ్ళాడు.గురువారం రోజు రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కోరుట్ల కు వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు.దొంగలు ఇంట్లో ఉన్న రెండు బీరువాలను బద్దలు కొట్టి అందులో ఉన్న మూడు తులాల బంగారు హారం,చెవి కమ్మలు,50 వేల నగదును ఎత్తుకు వెళ్ళినట్లు ఇంటి యజమాని తెలిపారు.సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్, క్లూస్ టీం తో కలిసి పరిశీలించారు.త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలిసులు తెలిపారు.ఎవరైనా వేరే గ్రామాలకు, తీర్థ యాత్రలకు వెళ్లాల్సి వస్తే ముందస్తు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.