ముద్ర, శేరిలింగంపల్లి:
మియాపూర్ సర్కిల్ ప్రధాన కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో డీసీ శశిరేఖ, అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని సమీక్షా సమావేశం జరిపిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. మియాపూర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీల వాసులు తమ గోడును వినిపించారు. తాము అనేక సంవత్సరాలుగా కాలనీలో నివాసముంటున్న మాకు కనీస వసతులు లేవని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజావాణిలో వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తక్షణమే తమకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ వాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిగణలోకి తీసుకొని అత్యవసర పనుల పై తక్షణమే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదు పై స్పందించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో అధికారులు ఉండాలని చైర్మన్ గాంధీ సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చైర్మన్ గాంధీ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు డీఈ శ్రీదేవి, ఏఈలు ప్రశాంత్, ప్రతాప్ మరియు మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి. ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అక్బర్ ఖాన్, పోషయ్య, తిరుపతి, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.