Take a fresh look at your lifestyle.

జగిత్యాలలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం… పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాణి…

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలను కన్నుదుల పండుగగా నిర్వహించారు.

ఈ మేరకు పట్టణంలోని కోదండ రామాలయం, మార్కండేయ స్వామి ఆలయం, హనుమాన్ వాడలోని హనుమాన్ గుడి, విద్యానగర్లోని రామాలయం తో పాటు మరికొన్ని ఆలయాల్లో రాములోరి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో జగిత్యాల మున్సిపాలిటీ పాలక వర్గం తరపున మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సమీండ్ల వాణి శ్రీనివాస్ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే అర్బన్ మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావసంత సురేష్ దంపతులు సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వార్డు కౌన్సిలర్లు, ఆలయ కార్యవర్గం, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.