ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
చేస్తున్న అభివృద్ధి అడ్డుకుంటున్నారు… అభివృద్ధి లో ముందుకు వెళ్లకుండా కాళ్ల లో కట్టెలు పెట్టి కిందపడేస్తున్నారు… అభివృద్ధి ని చూడలేక… తన ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపేస్తారో ఏమో… అని రాష్ట్ర పశు సంవర్థక, యువజనుల, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం మక్తల్ మండలం లోని పులిమామిడి లో సబ్ స్టేషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.3.25కోట్ల ఖర్చు తో చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేక కొందరు అడ్డుకుంటున్నారని ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇతర పార్టీ ల నేతలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న అభివృద్ధి ని చూసి తట్టుకోలేని కొందరు తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి హాట్ కామెంట్ చేశారు. ఇప్పటివరకే తనను చంపేందుకు ప్రయత్నం జరిగిందని, ఎవరు ఎన్ని కుట్ర లు చేసినా మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. చావు, పుట్టుక భగవంతుడు నిర్ణయిస్తాడని, ఆయన ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వెళ్ళాన్సిందే అని మంత్రి పేర్కొన్నారు. అంతవరకు ఎవరికి భయపడేది లేదన్నారు.ఎంత మంది అడ్డుకున్నా అభివృద్ధి లో ముందుకెలుతానని,తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అనంతరం మక్తల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఆసుపత్రి పనులు తుది దశ కు చేరుకున్నాయని, నిర్మాణం పనులను నాణ్యతతో చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.పెండింగ్ లో ఉన్న పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కొద్ది రోజుల్లో ఈ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.