Take a fresh look at your lifestyle.

కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

  • పోలీసుల జోక్యంతో కథ సుఖాంతం.

ధర్మపురి, ముద్ర : ధర్మపురి పట్టణ కేంద్రంలో పట్టణ కేంద్రానికి చెందిన రైపల్లి గోపి అనే వ్యక్తి కుటుంబ కలహాలతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యానికి ఎక్కించగా పోలీసులు నచ్చజెప్పి కిందికి దించడంతో కథ సుఖంతమైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టిన కేంద్రానికి చెందిన గడిపెళ్లి గోపి (42) అనే వ్యక్తి తన భార్యతో కుటుంబ విషయంలో గొడవపడి ధర్మపురి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు.సమాచారం అందుకున్న సి.ఐ రాంనర్సింహ రెడ్డి వెంటనే స్పందించి, హుటాహుటిన పోలీస్ సిబ్బంది తో కలిసి సంఘటన స్థలికి చేరుకున్నాడు. ఫైర్ ఇంజన్ పిలిపించి, ఫైర్ ఇంజన్ లో వున్న వైర్లెస్ మైక్ తో తన కూతురు, భార్యతో అతనితో మాట్లాడించి, సిఐ కూడా అతనితో మాట్లాడి నచ్చచెప్పాడు. ఎట్టకేలకు గంటన్నర తరువాత టవర్ పైనుంచి కిందికి దిగాడు. వెంటనే అతన్ని సిఐ పోలీస్ వాహనంలో స్థానిక ప్రభుత్య ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సిఐ రాంనర్సింహ రెడ్డి వెంటనే స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడినారని స్థానికులు సిఐ, పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ఫైర్ సిబ్బందిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.