కాప్రా ముద్ర
ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన కాలనీలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారు.
కాలనీ వాసులతో కలిసి పనులు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.