నెంబర్ 1 ఫాల్త్ జగిత్యాల ఎమ్మెల్యే ….
బిచ్చగాడు రేవంత్ మోదీ దగ్గర ఆడుకుంటాడు. వీని దగ్గర పైసలు ఎక్కడివి…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నెంబర్ వన్ ఫాల్తూ అని, సంజయ్ ముమ్మాటికి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై హాట్ కామెంట్స్ ఎంపీ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం కు కనెక్టివిటీ, ఎక్సెబిలిటీ ఉండాలనే జగిత్యాల రూరల్ మండలం చల్గల్ లో ప్రపోజల్ పెట్టినామన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బిఆర్ఎస్ ను ఎందుకు వదిలినావని, పార్టీ ఎందుకు మారావని, కాంగ్రెస్ లో చేరి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటిదని ఆయన ప్రశ్నించారు. బిడ్డ నిన్ను రాజకీయం గా నగ్నంగా చేసే వరకూ వదిలిపెట్టనని హెచ్చరించారు. దేశంలో అన్ని ప్రాంతాలలో కేంద్రీయ విద్యాలయం కు 5-10 ఎకరాలు కేటాయించబడిందని, కాని జగిత్యాలలో మాత్రం రెండు ఎకరాలు ఇప్పించాడని, ఇది రిజక్ట్ అయితది అని తెలుసని, అందుకే ఈ ప్రతిపదన పెట్టిండని ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డే స్కాలర్ స్కూల్ పిల్లలు, పోషకులు రెండు సార్లు వచ్చి వెళ్లాల్సి ఉంటదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు స్థలం రాకముందు టెండర్, బడ్జెట్ ఏలా ఫైనల్ అయింది ప్రజలు ఆలోచన చెయ్యాలన్నారు. బిచ్చగాడు సీఎం రేవంత్ మోదీ దగ్గర ఆడుకుంటాడని, వీని దగ్గర పైసలు ఎక్కడివని ఎద్దేవ చేశారు. బుల్లెట్ ట్రైన్ లకు 2021 లో ఫైనల్ రిపోర్ట్ వచ్చిందని, మోడీ తెలంగాణ కు 3 కారిడర్ లు ఇచ్చిండని, తొండలు చూసి ఏమన్నా బుల్లెట్ ట్రైన్ అనుకున్నావా రేవంత్ ? అని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే అడ్డం పడడం వల్ల కేంద్రీయ విద్యాలయం ఒక ఏడాది విద్యా సంవత్సరం వెనకబడి పోయిందని, ఎమ్మెల్యే వి చాలా స్కామ్ లు ఉన్నాయని, ఒక్కొక్కటి బయట పెడతానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు అకల్ లేదని, ఉత్తమ్ కుమార్ వెస్ట్ గాడని, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ కు టికెట్ లు అమ్ముకున్నాడని అరవింద్ ఆరోపించారు. ఎస్పీ నౌకరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, ఈ రోజు తప్పక గుర్తుంటాదని, ఐపీఎస్ లు చదివి పాసై కాంగ్రెస్ రంగు పూసుకుంటా అంటే కుదరదని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పై మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అనుమతి ఎట్లా ఇస్తావ్. మాకూ ఎట్లా రిజెక్ట్ చేస్తావని, అన్నిటికి సమాధానం ఇవ్వల్సి వస్తుందని హెచ్చరించారు. అర్వింద్ ధర్మపురి రాజకీయము ఇవాళ చూస్తావ్, రాజకీయం బారాబార్ చేస్తాం, సొల్లు పురాణం మాట్లాడుడు బంద్ చెయ్ ఎమ్మెల్యే సంజయ్ అని పేర్కొన్నారు. అకాడమిక్ ఇయర్ పోనివ్వనని, రెండేళ్లు లేట్ అయిన మంచి స్థలం లోనే పెట్టి తీరుతానాని అన్నారు. బీఆర్ఎస్ లో పుట్టి పెరిగినోళ్లు బావిలోని కప్పల లెక్కనే బతుకుతారని అన్నారు. జగిత్యాల ప్రాంతంలో సగానికి ఎక్కువ సామన్య ప్రజలకు అవకాశం ఉంటుందని, ఎమ్మెల్యే ఇగో వల్ల పట్టణం, పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మంత్రికి బుద్ది ఉండాలి కాదా. కేవీ కు రెండేకారాలు ఇస్తావా? అని మండిపడ్డారు. ఈ సమావేశంలో బిజెపి నియర్ కార్గి ఇంచార్జ్ భోగ శ్రావణి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.